Search This Blog

Thursday, January 22, 2015

Diabetes ( మధు మేహం )

మధుమేహ వ్యాధిని కంట్రోల్ చేసే ‘అల్లం’...!
నేటి సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అధిక శ్రమ వల్ల యుక్తవయసులోనే మనం మధుమేహ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం. శరీరంలో పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తం ద్వారా చక్కెరను శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తూ సమర్ధవంతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడం లేదా అనియంత్రిత వల్ల రక్తంలో చక్కెర పేరుకుపోయి వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తంలో, మూత్రంలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
మానవ శరరీంలో చక్కెర వుండాల్సిన శాతం కన్నా ఎక్కువ వున్నప్పుడు అది వ్యాధిగా పరిణమిస్తుంది. దీనినే షుగర్‌ లేక డయాబెటిస్‌ అంటారు. ఓ ప్రముఖ సిడ్నీ యూనివర్సిటీ ఫార్మాసూటికల్‌ కెమిస్ట్రీ ఫ్రొఫెసర్‌ చేసిన పరిశోధన ఆధారంగా మనం రోజువారీ వాడే ఆహారంతోనే చక్కెర వ్యాధికి చెక్‌ పెట్టొచ్చన్న విషయాన్ని కనుగొన్నారు. అలాంటి వాటిలో ఎక్కువ ప్రభావం చూపించేది 'అల్లం'.
మానవ శరీరంలోని బ్లడ్‌ గ్లూకోజ్‌ను అదుపు చేయడంతో అల్లం తోడ్పడుతుంది. స్వచ్ఛందంగా గ్లూకోజ్‌ను కండరాల్లోని కణాలకు చేరుస్తుంది. దీర్ఘకాలంగా షుగర్‌తో బాధపడుతున్న రోగులకు ఇది చక్కని మందు. షుగర్‌ లెవల్స్‌ను అదుపు చేయడం, ఇన్సూలిన్‌ను స్వతహాగా ఉత్పత్తి చేసే లక్షణం కండరాలకు కల్పిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో శరీరంలోని ఎక్కువ శాతం గ్లూకోజ్‌ను స్కెలెటల్‌ మజిల్స్‌ క్రమబద్దీకరిస్తాయి. 1% అల్లం తీసుకుంటే కూడా ఫలితం వుంటుంది.
రక్తంలోని కొలెస్ట్రాల్‌ ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. శొంఠి ఏండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది.. నోటిలో చేరిన ప్రమాదక బ్యాక్టీరియల్ను సంహరించి, దంతలను ఆరొగ్యముగా ఉంచుతుంది.

No comments:

Post a Comment